: డెన్మార్క్ సదస్సులో కాల్పులు... ఇద్దరి మృతి, పలువురికి గాయాలు
డెన్మార్క్ రాజధాని కోపెన్ హెగెన్ నగరంలో ఒక కేఫ్ లో వాక్‌స్వాతంత్య్రంపై జరుగుతున్న సదస్సుపై దుండగులు తుపాకులతో దాడి చేశారు. సమావేశ మందిరంలోకి దూసుకు వచ్చిన కొందరు ఆగంతుకులు విచక్షణారహితంగా కాల్పులు జరిపినట్టు సమాచారం. ఈ ఘటనలో ఇద్దరు చనిపోయినట్టు తెలుస్తోంది. సమాచారం అందుకున్న భద్రతాదళాలు వెంటనే అక్కడికి చేరుకున్నాయి. అయితే, అప్పటికే దుండగులు పారిపోయారు, దీంతో దుండగుల కోసం గాలింపుచర్యలు మొదలుబెట్టాయి. సుమారు 10 మంది వరకూ గాయపడినట్టు సమాచారం.