: హైదరాబాదులో 45 శాతం దొంగ ఓట్లేనట!
బోగస్ ఓట్ల ఏరివేత కార్యక్రమంలో భాగంగా హైదరాబాదులో చేపట్టిన పైలెట్ ప్రాజక్టులో పలు ఆసక్తికర విషయాలు వెల్లడవుతున్నాయి. మొత్తం ఓటర్లలో బోగస్ ఓట్లు ఒక్కో నియోజకవర్గంలో 32 నుంచి 45 శాతం వరకూ ఉన్నట్లు అధికారులు అనుమానిస్తున్నారు. 15 పోలింగ్ కేంద్రాల్లో నిర్వహించిన సర్వేలో ఈ విషయం తేలింది. దొంగ ఓట్లు ఎక్కువగా వున్న కారణంగానే, ఏ ఎన్నికలు జరిగినా పోలింగ్ 52 నుంచి 53 శాతానికి మించడం లేదని అధికారులు తేల్చారు. దాదాపు 39 శాతం మంది ఇళ్లు మారినప్పటికీ ఇంకా వారి ఓట్లు యథావిధిగా సంబంధిత నియోజకవర్గంలో కొనసాగుతున్నాయి. చనిపోయినవారి ఓట్లూ జాబితాలో ఉన్నట్లు తెలుస్తోంది. దీన్ని అరికట్టేందుకు ఆధార్ కార్డును అనుసంధానం చేయాలని తెలంగాణ సర్కారు యోచిస్తోంది.