: నరాలు తెగిపోతున్నాయ్... టెన్షన్ తట్టుకోలేకపోతున్న భారతీయులు!
వంద మ్యాచ్లలో ఓడిపోయినా పర్వాలేదు. ఈ ఒక్క మ్యాచ్ గెలిస్తేచాలు... సగటు భారత క్రీడాభిమాని కోరిక ఇది. ప్రపంచకప్ సోయగానికి ప్రతీకగా నిలిచే ఆ మ్యాచ్ కోసం ప్రపంచవ్యాప్తంగా 130 కోట్ల మంది ఎదురుచూస్తున్నారు. ఊహ తెలిసిన పిల్లాడి నుంచి పండు ముదుసలి వరకు, సామాన్యుడి నుంచి కార్పొరేట్ దిగ్గజాల వరకూ మరికాసేపట్లో ప్రారంభం కానున్న భారత్ - పాకిస్తాన్ మ్యాచ్ కోసం వెయ్యికళ్ళతో ఎదురుచూస్తున్నారు అనడంలో సందేహం లేదు. ప్రపంచకప్ లో రెండు దశాబ్దాలకు పైగా పాకిస్తాన్ పై కొనసాగుతున్న అప్రతిహత జైత్రయాత్రలో మరో అంకానికి ఈ ఉదయం 9 గంటలకు తెరలేవనుంది. క్రీడాభిమానులందరూ నరాలు తెగే టెన్షన్ తో ఈ పోరు కోసం క్షణాలను గంటలుగా భావిస్తూ కాలం గడుపుతున్నారు.