: చిలిపి చేష్టల ఒబామా... యూట్యూబ్ లో హల్ చల్ చేస్తున్న వీడియో!


అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా చిలిపి చేష్టలతో ఆకట్టుకుంటున్నారు. ఏకాంతంలో మనమెలా ప్రవర్తిస్తామో, అచ్చం అలాగే చిలిపి పనులు చేస్తున్న ఒబామా వీడియో ఒకటి ప్రస్తుతం యూట్యూబ్ లో హల్ చల్ చేస్తోంది. అద్దంలో ముఖ కవళికలు మార్చి మార్చి చూసుకోవడం, నవ్వును ప్రాక్టీస్ చేయడం, సెల్ఫీ తీసుకోవడం తదితర చిలిపి పనులతో కూడిన ఆ వీడియోలో ఒబామా, అసలు తాను అమెరికా అద్యక్షుడిని కాదనే రీతిలో కనిపిస్తున్నారు. హెల్త్ కేర్ పథకంలో పేర్లను నమోదు చేసుకునేలా అమెరికన్లను ప్రోత్సహించేందుకే ఒబామా ఈ వీడియోను విడుదల చేశారు. తనను ఇంటర్వ్యూ చేసేందుకు వచ్చే ఓ విలేకరి కోసం వేచి చూస్తున్న ఒబామా చిలిపి చేష్టలు ఆ వీడియోలో కనువిందు చేస్తున్నాయి. హెల్త్ కేర్ పథకంలో పేర్లు నమోదు చేసుకునేందుకు రేపే చివరి రోజు. దీంతోనే ఒబామా ఈ వీడియోను విడుదల చేశారు.

  • Loading...

More Telugu News