: పంటలెండుతున్నాయి... సోదరభావంతో సహకరించండి: తెలంగాణ సర్కారుకు రాయపాటి విజ్ఞప్తి
నాగార్జునసాగర్ జల వివాదంపై నరసరావుపేట ఎంపీ రాయపాటి సాంబశివరావు స్పందించారు. నీరు లేక ఆంధ్రా ప్రాంతంలో లక్షల ఎకరాల్లో పంటలెండుతున్న నేపథ్యంలో తెలంగాణ సర్కారు సోదరభావంతో నీటి విడుదలకు అంగీకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. సాగర్ జలాశయం నుంచి నీటి విడుదల విషయంలో కృష్ణా ట్రైబ్యునల్ సూచనల మేరకు నీటి పంపిణీ జరగాలని ఆయన అభిప్రాయపడ్డారు. రాష్ట్ర విభజనకు సంబంధించి పార్లమెంట్ లో యూపీఏ సర్కారు ఆర్డినెన్స్ కాకుండా బిల్లును ప్రవేశపెట్టి ఉంటే, ఈ వివాదాలకు ఆస్కారం లేకుండా ఉండేదన్నారు. నీటి వాటాల పంపిణీకి సంబంధించి కృష్ణా బోర్డు ప్రేక్షక పాత్ర వహించడం తగదని ఆయన అన్నారు.