: నర్సీపట్నంలో మంత్రి అయ్యన్న కుమారుడి వివాహ రిసెప్షన్... హాజరైన చంద్రబాబు, మంత్రులు


ఏపీ పంచాయతీ రాజ్ శాఖ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడి కొడుకు వివాహ రిసెప్షన్ విశాఖ జిల్లా నర్సీపట్నంలో కొద్దిసేపటి క్రితం ప్రారంభమైంది. ఈ రిసెప్షన్ కు ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడితో పాటు ఆయన కేబినెట్ మంత్రులు హాజరయ్యారు. నేడు హైదరాబాదులో గవర్నర్ సమక్షంలో తెలంగాణ సీఎంతో భేటీ అయిన చంద్రబాబు ఆ తర్వాత శ్రీకాకుళం జిల్లా పర్యటనకు వెళ్లిన సంగతి తెలిసిందే. శ్రీకాకుళం జిల్లా పర్యటనను ముగించుకున్న అనంతరం చంద్రబాబు అక్కడి నుంచే నేరుగా నర్సీపట్నం చేరుకున్నారు. రిసెప్షన్ తర్వాత చంద్రబాబు హైదరాబాదు బయలుదేరనున్నారు.

  • Loading...

More Telugu News