: శ్రీశైల బ్రహ్మోత్సవాల్లో పూర్తికాని విద్యుత్ పనులు.... చీకట్లో భక్తుల ఇబ్బందులు
శ్రీశైలంలో జరగనున్న శివరాత్రి బ్రహ్మోత్సవాలకు సంబంధించిన విద్యుత్ దీపాల ఏర్పాట్ల పనులు పూర్తి కాలేదు. ఈ నేపథ్యంలో శ్రీశైల క్షేత్రంలో విద్యుత్ సరఫరాలో గంటల తరబడి అంతరాయం కలుగుతోంది. దీంతో ప్రస్తుతం శ్రీశైల పుణ్యక్షేత్రంలో చీకట్లు అలముకున్నాయి. ఇప్పటికే శ్రీశైలానికి పెద్ద సంఖ్యలో భక్తులు చేరుకున్నారు. విద్యుత్ దీపాలు తరచూ ఆరిపోతుండటంతో భక్తులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఇదిలా ఉంటే, విద్యుత్ పనులు ఇంకా పూర్తి కాకపోవడం, భక్తుల సంఖ్య గంటగంటకూ పెరుగుతుండటంతో అధికారుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది.