: గొడవకు కారణం ఇద్దరు ముఖ్యమంత్రులే!: సీపీఎం
నాగార్జున సాగర్ నీటి గొడవకు కారణం రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులే అని సీపీఐ ఏపీ విభాగం కార్యదర్శి రామకృష్ణ, తెలంగాణ విభాగం కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఆరోపించారు. ఇరు రాష్ట్రాల నీటి వివాదాలపై కేంద్ర ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకోవాలని... ఈ విషయంలో గవర్నర్ నరసింహన్ జోక్యం చేసుకోవాలని సూచించారు. ఇరు రాష్ట్ర ముఖ్యమంత్రులు చంద్రబాబు, కేసీఆర్ లు పరస్పరం సహకరించుకోవాలని అన్నారు. విభజన చట్టంలోని కీలక అంశాలన్నింటినీ వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు.