: టీమిండియా... ఆల్ ద బెస్ట్: ప్రమాణ స్వీకార వేదికపై నుంచి ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ గ్రీటింగ్స్


ఐసీసీ వన్డే వరల్డ్ కప్ నేపథ్యంలో ప్రపంచం మొత్తానికి క్రికెట్ పీవర్ పట్టుకుంది. అందుకు ఏ ఒక్కరు అతీతులు కారు. ఏడాది కాలంలో రెండో సారి ఢిల్లీలో విజయదుందుభి మోగించి రికార్డు సృష్టించిన ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ కూడా ఇందుకు మినహాయింపేమీ కాదు. ఎందుకంటే, ఆయన కూడా టీమిండియా వరల్డ్ కప్ తో తిరిగి రావాలని మనస్ఫూర్తిగా కొరుకుంటున్నారు. క్రికెట్, టీమిండియాపై ఉన్న అమితాసక్తి నేపథ్యంలో ఆయన ఏకంగా సీఎంగా పదవీ ప్రమాణం చేసిన వేదిక నుంచే ధోనీ సేనకు గ్రీటింగ్స్ చెప్పారు. నేటి ఉదయం డిల్లీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రాంలీలా మైదాన్ వేదిక నుంచే ఆయన టీమిండియాకు ‘‘ఆల్ ద బెస్ట్’’ చెప్పి అందరినీ ఆశ్చర్యచకితులను చేశారు.

  • Loading...

More Telugu News