: దేశ రాజధానిలో వీఐపీ సంస్కృతికి చెల్లుచీటి ఇచ్చేస్తాం: ఢిల్లీ సీఎం కేజ్రీవాల్
దేశ రాజధానిలో వీఐపీ సంస్కృతికి చెల్లుచీటి ఇచ్చేస్తామని ఢిల్లీ కొత్త ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ స్పష్టం చేశారు. నేటి ఉదయం ఢిల్లీ ముఖ్యమంత్రిగా పదవీ ప్రమాణం చేసిన ఆయన కొద్దిసేపటి క్రితం సీఎంగా బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఢిల్లీ ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్న వీఐపీ సంస్కృతిని సమూలంగా నిర్మూలించేందుకు చర్యలు తీసుకుంటామని ఆయన వెల్లడించారు. ఇందుకోసం ప్రణాళికబద్ధంగా ముందుకెళతామని తెలిపారు. ముఖ్యమంత్రిగా ఎన్నికైన తనకు కేటాయించిన జెడ్ ప్లస్ కేటగిరీ సెక్యూరిటీని ఆయన తిరస్కరించిన సంగతి తెలిసిందే.