: బుల్లితెర నటి దీప్తి ఆత్మహత్య
పలు టీవీ సీరియల్స్ లో నటిస్తూ పేరు తెచ్చుకున్న బుల్లితెర నటి దీప్తి అలియాస్ రామలక్ష్మి ఈ ఉదయం ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. హైదరాబాద్, బాలానగర్ సమీపంలోని ఫతేనగర్ లోని ఒక అపార్ట్ మెంట్లో ఆమె ఆత్మహత్య చేసుకుంది. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకున్నారు. ఆమె మరణానికిగల కారణాలు ఇంకా తెలియరాలేదు. కేసు నమోదు చేసుకున్న పోలీసుకు దర్యాప్తు ప్రారంభించారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సివుంది.