: సాగర్ డ్యాం నుంచి కృష్ణానది వంతెనపైకి మారిన టీఆర్ఎస్ నిరసన
నల్లగొండ జిల్లా దామరచర్ల సమీపంలోని విష్ణుపురం వద్ద కృష్ణానదిపై ఉన్న వంతెన దగ్గర టీఆర్ఎస్ కార్యకర్తలు ఈ మధ్యాహ్నం ఆందోళనకు దిగారు. ఈ ధర్నా నేపథ్యంలో అద్దంకి, నార్కట్పల్లి జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడింది. నాగార్జున సాగర్ డ్యాం వద్ద నిన్న ఆంధ్రప్రదేశ్ పోలీసులు వ్యవహరించిన తీరుకు నిరసనగా ఈ ధర్నా చేస్తున్నట్లు వారు పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి దిష్టిబొమ్మను దహనం చేశారు. వారిని చెదరగొట్టేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.