: జ్వరం లేకున్నా... దగ్గు, జలుబు ఉంటే స్వైన్ ఫ్లూ ప్రమాదం
మీరు దగ్గు, జలుబుతో బాధపడుతున్నారా? తక్షణం జాగ్రత్త పడండి. అవి స్వైన్ ఫ్లూ లక్షణాలు. అదేంటి జ్వరం లేదుగా అనుకుంటున్నారా? స్వైన్ ఫ్లూకు కారణమైన హెచ్1ఎన్1 ఇన్ ఫ్లూయెంజా సోకితే బయటకు కనిపించే తొలి సంకేతం దగ్గు, జలుబులేనట. జ్వరం లేకున్నా, ఈ రెండు లక్షణాలతో బాధపడుతున్న వారిని పరీక్షిస్తే, స్వైన్ ఫ్లూ వైరస్ వారికి సోకినట్టు తేలిందని న్యూఢిల్లీ వైద్యులు తెలిపారు. ఈ వైరస్ పరివర్తనం చెందుతోందనడానికి ఇదే సంకేతమని ఇంద్రప్రస్థ అపోలో ఆసుపత్రి సీనియర్ వైద్యులు తెలిపారు. జలుబు లేకుండా నీళ్ళ విరోచనాలు ఉన్నా స్వైన్ ఫ్లూ లక్షణమేనని ఆయన తెలిపారు.