: రాణించిన ఫించ్, మ్యాక్స్ వెల్... ఇంగ్లండ్ లక్ష్యం 343


ప్రపంచకప్ లో భాగంగా మెల్ బొర్న్ లో ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ జట్ల మధ్య ఆసక్తికర పోరాటం జరుగుతోంది. టాస్ గెలుచుకున్న ఇంగ్లండ్ జట్టు ఆస్ట్రేలియాను బ్యాటింగ్ కు ఆహ్వానించింది. దీంతో బ్యాటింగ్ ప్రారంభించిన ఆసీస్ నిర్ణీత 50 ఓవర్లలో9 వికెట్ల నష్టానికి 342 పరుగులు చేసింది. ఆరోన్ ఫించ్ (135) సత్తా చాటగా, మ్యాక్స్ వెల్ (66) మెరుపులు మెరిపించాడు. వారికి బెయిలీ (55) చక్కని సహకారం అందించాడు. దీంతో ఆస్ట్రేలియా జట్టు ఇంగ్లండ్ కు 343 పరుగుల విజయ లక్ష్యం నిర్దేశించింది. ఇంగ్లండ్ బౌలర్లలో ఫిన్ ఐదు వికెట్లతో రాణించగా, అతనికి రెండు వికెట్లతో బ్రాడ్ సహకరించాడు. కాసేపట్లో ఇంగ్లండ్ బ్యాటింగ్ ప్రారంభించనుంది.

  • Loading...

More Telugu News