: ప్రపంచకప్ లో పెద్ద, చిన్న, పొట్టి, పొడుగు వీళ్లే


ప్రపంచకప్ ప్రారంభమైంది. వరల్డ్ కప్ లో జట్లు కూర్పుపై పెద్దగా ఆసక్తి చూపని అభిమానులు పలువురు క్రికెటర్లపై ఆసక్తి చూపుతున్నారు. రిటైర్ కావాల్సిన వయసులో కూడా తనలో సత్తా ఉందని చెబుతున్న యూఏఈ ఆటగాడు ఖుర్రమ్ ఖాన్ (43) ఈ వరల్డ్ కప్ లో పాల్గొంటున్న వారిలో అత్యంత పెద్ద వయస్కుడు. అత్యంత చిన్న వయస్కుడు ఆఫ్ఘనిస్థాన్ కు చెందిన ఉస్మాన్ ఘనీ (18). అలాగే వరల్డ్ కప్ లో ఆడుతున్న ఆటగాళ్లలో పాకిస్థాన్ కు చెందిన మొహ్మద్ ఇర్ఫాన్ (7.1 అడుగులు) అత్యంత పొడగరి కాగా, బంగ్లాదేశ్ కు చెందిన ముష్ఫికర్ రహీమ్ (5.3) తక్కువ ఎత్తు కలిగిన వ్యక్తి. వీరి ప్రదర్శనపట్ల అభిమానులు ఆసక్తి చూపుతున్నారు.

  • Loading...

More Telugu News