: ముగిసిన సాగర్ వివాదం... హరీష్, ఉమాల ఉమ్మడి మీడియా సమావేశం


గవర్నర్ నరసింహన్ తో ఇరు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశం ముగిసింది. సాగర్, శ్రీశైలం జలాలపై ఇరు రాష్ట్రాల మధ్య నెలకొన్న వివాదంపై ఈ భేటీలో చర్చించారు. అనంతరం ఇద్దరు ముఖ్యమంత్రులు వెళ్లిపోగా... ఇరు రాష్ట్రాల భారీ నీటిపారుదల శాఖ మంత్రులు దేవినేని ఉమా, హరీష్ రావులు కలసికట్టుగా మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. ఈ సందర్భంగా రానున్న రోజుల్లో చేపట్టబోయే కార్యాచరణను వారు వివరించారు. సాగర్ ఆనకట్టపైకి ఇరు రాష్ట్రాల పోలీసులు, కార్యకర్తలు, రైతులు వెళ్లకుండా ఆదేశాలు జారీ చేయనున్నట్టు తెలిపారు. నీటి పంపిణీపై అవగాహన కుదిరిందని చెప్పారు. ఇరు రాష్ట్రాల్లోని పంటలు ఎండిపోకుండా రెండు ప్రభుత్వాలు జాగ్రత్తలు తీసుకుంటాయని, సహకరించుకుంటాయని వెల్లడించారు. భవిష్యత్తులో నీటి గురించి ఉద్రిక్తతలు తలెత్తకుండా చర్యలు తీసుకుంటామని ప్రకటించారు. హైదరాబాద్ తో పాటు, మరో 5 జిల్లాల తాగునీటి అంశంపై రోజువారీ సమీక్షలు నిర్వహిస్తామని చెప్పారు. ఏయే రాష్ట్రానికి ఎంత నీరు అవసరమన్న విషయాన్ని ఇంజినీరింగ్ అధికారులు సమీక్షించి, నిర్ణయిస్తారని... వారి నిర్ణయాన్ని రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు పాటిస్తాయని హరీష్, ఉమా కలసి ఉమ్మడి ప్రకటన చేశారు.

  • Loading...

More Telugu News