: గవర్నర్ తో ముగిసిన ఇద్దరు చంద్రుల సమావేశం


నాగార్జున సాగర్ జలవివాదం రాజ్ భవన్ కు చేరిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గవర్నర్ నరసింహన్ తో సమావేశమయ్యారు. తొలుత ఇద్దరు ముఖ్యమంత్రులతో విడివిడిగా సమావేశమైన గవర్నర్... ఆ తర్వాత ఇద్దరితో కలసి ఉమ్మడిగా సమావేశం నిర్వహించారు. ఈ భేటీలో సాగర్ నీటి విడుదలపై చర్చించారు. ఇద్దరు ముఖ్యమంత్రుల అభిప్రాయాలను ఈ సందర్భంగా గవర్నర్ తెలుసుకున్నారు. అనంతరం ఇద్దరు ముఖ్యమంత్రులు రాజ్ భవన్ నుంచి వెళ్లిపోయారు. సమావేశానికి, చంద్రబాబుతో పాటు మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు రాగా... కేసీఆర్ తో పాటు మంత్రి హరీష్ రావు వచ్చారు. ఇరు రాష్ట్రాల డీజీపీలు కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు.

  • Loading...

More Telugu News