: కేసీఆర్ ను గాంధీతో పోల్చిన ఆయన కూతురు కవిత
మన జాతిపిత మహాత్మాగాంధీతో సమానంగా తన తండ్రి కేసీఆర్ ను పోల్చారు ఆయన కూతురు, నిజామాబాద్ ఎంపీ కవిత. ఒక బక్క వ్యక్తి (గాంధీ) నాటి బ్రిటీష్ పాలనకు చరమగీతం పాడి దేశానికి స్వాతంత్ర్యం తెస్తే... మరో బక్క వ్యక్తి (కేసీఆర్) ఆంధ్రపాలన నుంచి తెలంగాణకు విముక్తి కలిగించారని అన్నారు. టీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో ఆమె మాట్లాడుతూ, 'తెలంగాణ తెచ్చుడో, కేసీఆర్ చచ్చుడో' అంటూ 14 ఏళ్లపాటు కేసీఆర్ అలుపెరుగని పోరాటం చేశారని చెప్పారు. ఉద్యమాలు చేస్తూ, అటుకులు తింటూ పోరాటం చేసిన కేసీఆర్... యూపీఏ మెడలు వంచి రాష్ట్రాన్ని సాధించారని చెప్పుకొచ్చారు. కేసీఆర్ పోరాటాన్ని తక్కువ చేసి చూడలేం కాని, ఆయనను గాంధీతో పోల్చడం మాత్రం బాగోలేదని కొంత మంది విశ్లేషకులు అభిప్రాయపడుతుండటం గమనార్హం.