: ఎదురీదుతున్న శ్రీలంక
ప్రపంచకప్ లో భాగంగా న్యూజిలాండ్ లో జరుగుతున్న తొలి వన్డేలో శ్రీలంక జట్టు ఎదురీదుతోంది. 332 పరుగుల విజయలక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన శ్రీలంక ఆరు వికెట్ల నష్టానికి 168 పరుగులు చేసి కష్టాల్లో పడింది. ఎన్నో ఆశలు పెట్టుకున్న టాపార్డర్ వెనుదిరగడంతో శ్రీలంక కష్టాల్లో పడింది. కరుణ రత్నే (14) అవుటవ్వడంతో క్రీజులోకి వచ్చిన అజంత మెండిస్ (4) స్వల్ప వ్యవధిలోనే వెనుదిరిగాడు. నిప్పులు చెరిగే బంతులతో శ్రీలంక పనిపట్టారు. వెటోరీ, బౌల్ట్, మెల్నీలు తలో రెండు వికెట్లు పడగొట్టి కివీస్ ను విజయం అంచుల్లో నిలబెట్టారు.