: సాగర్ నీటి వివాదంపై గవర్నర్ ను కలిసిన తెలంగాణ, ఏపీ ముఖ్యమంత్రులు
నాగార్జునసాగర్ నీటి తకరారు రాజ్ భవన్ కు చేరింది. సాగు, తాగు నీటి అవసరాలకు నీరు విడుదల చేయాలంటూ ఆంధ్రప్రదేశ్ కు చెందిన నీటి పారుదల శాఖాధికారులు తెలంగాణ అధికారులను అడగడంతో వివాదం చెలరేగింది. దీంతో, సాగర్ వద్ద రెండు ప్రాంతాల పోలీసులు మోహరించగా, వారు పరస్పరం ఘర్షణ పడిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు గవర్నర్ సమక్షంలో సమస్య పరిష్కారానికి సమావేశమయ్యారు. కాగా, నల్గొండ రైతులు, పోలీసులు భారీ సంఖ్యలో మోహరించగా, ఏపీ పోలీసులు డ్యాంకు పహారా కాస్తున్నారు. సమావేశం నేపథ్యంలో ఆదేశాల కోసం అధికారులు ఎదురు చూస్తున్నారు.