: దూకుడు పెంచుతున్న సమయంలో తొలి వికెట్ కోల్పోయిన లంక... తిరిమన్నే హాఫ్ సెంచరీ


న్యూజిలాండ్‌ తో జరుగుతున్న వన్డే మ్యాచ్‌ లో తొలుత నిదానంగా ఆడిన శ్రీలంక ఓపెనర్లు దూకుడు పెంచాలని భావించి హిట్టింగ్ మొదలుపెట్టగానే, దిల్షాన్ 24 పరుగుల (41 బంతుల్లో) వ్యక్తిగత స్కోర్ వద్ద వెటోరి బౌలింగ్‌ లో అతనికే క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. మరో వైపు క్రీజులో కుదురుగా ఆడుతున్న తిరిమన్నే 46 బంతుల్లో 7 ఫోర్ల సహాయంతో 50 పరుగులు చేశాడు. ప్రస్తుతం 19 ఓవర్లలో లంక జట్టు 1 వికెట్ నష్టానికి 103 పరుగులు చేసింది. ఇంకా 31 ఓవర్లలో 200 పరుగులు సాధించగలిగితే లంక విజయం సాధిస్తుంది.

  • Loading...

More Telugu News