: ఏ క్షణం ఏమవుతుందో?... సాగర్ డ్యామ్ వద్ద 2 వేల మంది పోలీసులు... భారీగా చేరుకున్న టీఆర్ఎస్ శ్రేణులు


నాగార్జున సాగర్ ప్రాజెక్టు వద్ద ఈ ఉదయం మరోసారి ఉద్రిక్త వాతావరణం నెలకొంది. తెలంగాణ వైపున 1000 మంది పోలీసులు, ఆంధ్ర వైపున మరో 1000 మంది పోలీసులు మోహరించారు. నల్గొండ జిల్లా వైపు పెద్దయెత్తున చేరుకున్న టీఆర్ఎస్ శ్రేణులు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళనకు దిగారు. ఏపీ ఇరిగేషన్ అధికారులు, పోలీసుల దౌర్జన్యం నశించాలంటూ కార్యకర్తలు పెద్ద ఎత్తున నినాదాలు చేస్తున్నారు. కాగా, కుడి కాలువకు నీటిని విడుదల చేసుకోవడానికి నిన్న ఆంధ్రప్రదేశ్ చేసిన ప్రయత్నం ఉద్రిక్తతకు దారితీసిన విషయం తెలిసిందే. ఈ విషయంలో సమస్య పరిష్కారం కోసం మరికాసేపట్లో గవర్నర్ వద్ద చంద్రబాబు, కేసీఆర్ లు సమావేశం కానున్నారు.

  • Loading...

More Telugu News