: 332 పరుగుల విజయ లక్ష్యాన్ని శ్రీలంక ముందుంచిన న్యూజిలాండ్


11వ ప్రపంచ కప్‌ లో భాగంగా క్రైస్ట్‌చర్చ్ లో జరుగుతున్న తొలి వన్ డేలో తొలుత బ్యాటింగ్ కు దిగిన న్యూజిలాండ్ జట్టు 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 331 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఓపెనర్లు గుప్తిల్ 49, మెక్ కల్లమ్ 65 పరుగులు చేసి మంచి ఆరంభాన్ని ఇవ్వగా, కేన్ విలియమ్సన్ 57 పరుగులతో ఆకట్టుకున్నాడు. సీజే అండర్సన్ 46 బంతుల్లో ఎనిమిది ఫోర్లు, రెండు సిక్స్ లు బాది 75 పరుగులు చేయడంతో కివీస్ జట్టు 300 పరుగుల మైలురాయిని అధిగమించింది. గెలుపుకోసం 332 పరుగులు చేయాల్సిన శ్రీలంక మరికాసేపట్లో బ్యాటింగ్ కు దిగనుంది.

  • Loading...

More Telugu News