: కాంగ్రెస్ కు అన్యాయం చేసిన ఏపీ ప్రజలు... ట్విట్టర్ వేదికగా ఆక్రోశం
ఆంధ్రప్రదేశ్ విభజనకు చివరగా ఒప్పుకొన్న తమ పార్టీని కూకటివేళ్లతో పెకలించి వేసి ఏపీ ప్రజలు అన్యాయం చేశారని ట్విటర్ వేదికపై దిగ్విజయ్ సింగ్ ఆక్రోశం వ్యక్తం చేశారు. విభజనకు అనుకూల సంకేతాలిచ్చిన టీడీపీ, వైసీపీ, బీజేపీలకు మాత్రం ఓట్లు వేశారని ఆయన అన్నారు. అటు తెలంగాణలోనూ లబ్ధి పొందలేకపోయామని ఆయన వాపోయారు. ఈ మేరకు ఆయన వరుస ట్వీట్లు చేశారు. తెలంగాణ ఏర్పాటుకు తాను ఇచ్చిన లేఖే కారణమని వరంగల్ లో, విభజనకు కారణం కాంగ్రెస్సేనంటూ ఆంధ్రాలో చెప్పిన బాబుకు ఓట్లు పడ్డాయని అన్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలకు ఇది కష్టకాలం అని చెప్పారు.