: ప్రపంచకప్ - 2015 తొలి రికార్డులివే!
క్రికెట్ వరల్డ్ కప్ పోటీల్లో తొలి రికార్డులు ఆటగాళ్లతో పాటు క్రీడాభిమానులకు గుర్తుండిపోతాయి. నేడు ప్రారంభమైన 11వ ప్రపంచ కప్ లో తొలి రికార్డులను న్యూజిలాండ్, శ్రీలంక ఆటగాళ్లు తమ పేరిట లిఖించుకున్నారు. తొలి ఓవర్ శ్రీలంక బౌలర్ కులశేఖర్ వేయగా, ఆ బంతిని న్యూజిలాండ్ బ్యాట్స్‌మెన్ మార్టిన్ గప్తిల్ ఆడాడు. అలాగే తొలి బౌండరీ, తొలి సిక్స్, తొలి అర్ధ శతకం సాధించిన ఆటగాడిగా న్యూజిలాండ్ కెప్టెన్ బ్రెండన్ మెక్ కలమ్ రికార్డులకెక్కగా, అతన్ని ఔట్ చేసి శ్రీలంక బౌలర్ హెరాత్ తొలి వికెట్ అందుకున్నాడు. తొలి మ్యాచ్ గెలిచే టీం ఎవరన్న విషయం మరికొన్ని గంటల్లో తేలుతుంది.