: ఈ వేసవిలో 'కాలవైశాఖి' ముప్పు... కాస్త ఉపశమనంతోపాటు నష్టాలు!
వేసవిలో ఏర్పడే 'కాలవైశాఖి' (క్యుములో నింబస్) మేఘాలు ఈ ఏడు మరింత ముందుగానే రానున్నాయట. ఈ విషయాన్ని భువనేశ్వర్ వాతావరణ అధ్యయన కేంద్రం వెల్లడించింది. రానున్న 24 గంటల్లో కోస్తా తీర జిల్లాల్లో వీటి ప్రభావం కనిపించే సూచనలు ఉన్నాయని, సాధారణంగా మార్చి నుంచి జూన్ మధ్య ఉష్ణోగ్రతల పెరుగుదలతో వాయుమండలంలో ఏర్పడే క్యుములో నింబస్ మేఘాల వల్ల వడగళ్లతో కూడిన భారీ వర్షాలు పడతాయని తెలిపారు. వేసవిలో ఏర్పడే కాలవైశాఖిల మూలంగా మండే ఎండ నుంచి కాస్త ఉపశమనం కలిగినా, నష్టాలు కూడా తప్పవని వివరించారు.