: మొదలైన క్రికెట్ పోరు... తొలి మ్యాచ్ లో 38 ఓవర్లకు న్యూజిలాండ్ స్కోర్ 217/4
క్రికెట్ పోటీల సంబరాలు ప్రారంభం అయ్యాయి. ప్రపంచకప్ మొదటి మ్యాచ్ న్యూజిలాండ్, శ్రీలంకల మధ్య క్రైస్ట్ చర్చ్ లో జరుగుతుండగా, తొలుత బ్యాటింగ్ కు దిగిన న్యూజిలాండ్ జట్టు 38 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 217 పరుగులు చేసింది. ఓపెనర్ బ్రెండన్ మెక్ కల్లమ్ ఈ వరల్డ్ కప్ లో తొలి అర్ధ సెంచరీ నమోదు చేసి 65 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద అవుటయ్యాడు. మరో ఓపెనర్ గప్తిల్(49) ఒక్క పరుగు తేడాతో హాఫ్ సెంచరీ కోల్పోయాడు. ప్రస్తుతం ఆండర్సన్, ఇలియట్ లు ఆడుతున్నారు.