: ఇంకా చోద్యం చూస్తారా?...జోక్యం చేసుకోవాలి: చాడ


తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య జల వివాదంపై కేంద్రం చోద్యం చూస్తోందని సీపీఐ నేత చాడ వెంకటరెడ్డి విమర్శించారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, జల వివాదంలో కేంద్రం తక్షణం జోక్యం చేసుకోవాలని డిమాండ్ చేశారు. నాగార్జునసాగర్ జలాశయం వద్ద ఆంధ్రా, తెలంగాణ పోలీసుల మధ్య జరిగిన ఘర్షణ ప్రజాస్వామ్యానికి గొడ్డలి పెట్టులాంటిదని ఆయన పేర్కొన్నారు. సాగర్ నీరు ఎంత వినియోగించుకున్నారో ఆంధ్రప్రదేశ్ అధికారులు స్పష్టం చేయాలని ఆయన డిమాండ్ చేశారు.

  • Loading...

More Telugu News