: ఆసీస్ ఓకే, పాపం సౌతాఫ్రికా...కివీస్ అండర్ డాగ్, విన్నర్ భారతే!: హీరో వెంకటేష్ అనాలిసిస్


టాలీవుడ్ లో క్రికెట్ అంటే గుర్తుకొచ్చే హీరో వెంకటేష్. క్రికెట్ పట్ల మక్కువ ప్రదర్శించే వెంకీ వరల్డ్ కప్ పై తన అభిప్రాయాలను వెల్లడించారు. సీసీఎల్ గెలిచిన సంతోషంలో ఉండగానే భారత జట్టు కూడా కప్పు తీసుకొస్తే పండగేనని అన్నారు. ప్రస్తుతం టీమిండియా సెమీఫైనల్ వరకు వస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు. అయితే ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా జట్లకు విజయావకాశాలు మెరుగ్గా ఉన్నాయని అన్నారు. సౌతాఫ్రికా సెమీస్ వరకూ అద్భుతంగా ఆడుతుందని చెప్పిన ఆయన, ఒత్తిడిలో సెమీస్ నుంచి నిష్క్రమించే అలవాటు ఈ వరల్డ్ కప్ నుంచి మారుతుందని భావిస్తున్నానని అన్నారు. సొంతగడ్డపై ఆడుతున్నందున న్యూజిలాండ్ అండర్ డాగ్ గా రేసులో ఉందని ఆయన పేర్కొన్నారు. టీమిండియా విషయానికి వస్తే సెమీఫైనల్ వరకు చేరుకుంటుందని అన్నారు. బౌలింగ్ పటిష్ఠంగా లేదని చెప్పిన వెంకీ, బ్యాటింగ్ లో తిరుగులేదని చెప్పారు. పాకిస్థాన్ మ్యాచ్ లో మాత్రం విజయం టీమిండియాదేనని స్పష్టం చేశారు. వరల్డ్ కప్ లో టీమిండియా భారాన్ని కోహ్లీ మోయాల్సిందేనని అన్నారు. సచిన్ లేకుండా ఆడుతున్న వరల్డ్ కప్ లో టీమిండియా బాధ్యతగా ఆడాలని వెంకీ సూచించారు.

  • Loading...

More Telugu News