: ట్రోఫీతో పాటుగా టీమిండియా సగర్వంగా వస్తుంది: కేంద్ర క్రీడల మంత్రి
భారత జట్టు ప్రపంచకప్ ట్రోఫీతో సగర్వంగా ఛాంపియన్ హోదాలో భారత్ కు తిరిగి వస్తుందని కేంద్ర క్రీడల మంత్రి శర్వానంద్ సోనోవాల్ అన్నారు. ఢిల్లీలో ఆయన మాట్లాడుతూ, వరల్డ్ కప్ ప్రారంభం సందర్భంగా టీమిండియాకు శుభాకాంక్షలని అన్నారు. ట్రోఫీతో టీమిండియా వస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. వంద కోట్ల మంది భారతీయుల ఆశీస్సులు టీమిండియా వెంట ఉన్నాయని ఆయన తెలిపారు. ధోనీ సేనపై తనకు నమ్మకం ఉందని ఆయన పేర్కొన్నారు.