: మీకు కరెంటు పరికరాలిచ్చాం, మరచిపోతే ఎలా?: ఎత్తి పొడిచిన హరీష్ రావు
హుదూద్ తుపాను నేపథ్యంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పంపిన విద్యుత్ సామాన్లపై మంత్రి హరీష్ రావు ఎత్తి పొడిచారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ, 'హుదూద్ తుపాను సందర్భంగా ఏపీకి విద్యుత్ వైర్లు, స్తంభాలు వంటి విద్యుత్ పరికరాలు పంపిస్తే, ఆ సహాయాన్ని మరచిపోయి ప్రవర్తిస్తున్నారు' అన్నారు. ఏపీకి కేటాయించాల్సిన నీటిని ఇప్పటికే వాడేసుకున్నారని ఆయన ఆరోపించారు. సాగర్ డ్యాంలో తెలంగాణకు రావాల్సిన వాటా మాత్రమే ఉందని, దానిని ఆంధ్రాకు ఇచ్చేది లేదని ఆయన అన్నారు. నీరు కావాలంటే తెలంగాణ రాష్ట్రాన్ని అడగాలని ఆయన సూచించారు. అది మానేసి సాగర్ డ్యాం దగ్గర డ్రామాలు ఆడవద్దని ఆయన హితవు పలికారు.