: పోలీసులు ఖాకీ చొక్కాలకు బదులు పసుపు చొక్కాలు వేసుకోవడం మంచిది: చింతా మోహన్ సెటైర్
తిరుపతి ఉపఎన్నిక పోలింగ్ సందర్భంగా పోలీసులు దగ్గరుండి రిగ్గింగ్ చేయించారని మాజీ ఎంపీ చింతా మోహన్ ఆరోపించారు. పోలీసులు ఖాకీ చొక్కాల స్థానంలో పసుపు చొక్కాలు ధరించడం మంచిదని వ్యంగ్యం ప్రదర్శించారు. రిగ్గింగ్ చేయాలంటూ సీఎం చంద్రబాబునాయుడు ఆదేశించారని, ఈ క్రమంలోనే అధికారులు, పోలీసులు రిగ్గింగ్ కు సహకరించారని దుయ్యబట్టారు. టీడీపీ ఎన్ని దౌర్జన్యాలు చేసినా కాంగ్రెస్ పార్టీదే విజయమని అన్నారు. ఇక, మీడియాపైనా చింతా మండిపడ్డారు. మీడియాలో కొన్ని సంస్థలు టీడీపీకి మద్దతిస్తున్నాయని ఆరోపించారు. తిరుపతి ఉపఎన్నిక సందర్భంగా ప్రజాస్వామ్యాన్ని చంపేశారని ఆయన వ్యాఖ్యానించారు.