: మంత్రి కావడం ఇష్టం లేదు: సోమ్ నాథ్ భారతి


ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు ఏది చేసినా వినూత్నంగా ఉంటుంది. ఢిల్లీని ఊడ్చేసిన ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన నేత మంత్రి పదవిని వద్దనుకుని సంచలనం రేపారు. ఇష్టపూర్వకంగానే తాను ఢిల్లీ కొత్త కేబినెట్ లో చేరదలచుకోలేదని ఆమ్ ఆద్మీ పార్టీ నేత సోమ్ నాథ్ భారతి తెలిపారు. ఢిల్లీలో ఆయన మాట్లాడుతూ, నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసి ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దడంపైనే దృష్టి కేంద్రీకరిస్తానని అన్నారు. అందుకే తాను ఢిల్లీ కేబినెట్ లో చేరడం లేదని ఆయన చెప్పారు. కాగా, ఆప్ గత కేబినెట్ లో సోమ్ నాథ్ భారతి మంత్రిగా పనిచేసిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News