: జాతీయ క్రీడల్లో ఏపీకి మరో స్వర్ణం
కేరళలో జరుగుతున్న 35వ జాతీయ క్రీడల్లో ఆంధ్రప్రదేశ్ కు మరో స్వర్ణ పతకం లభించింది. వెయిట్ లిఫ్టింగ్ లైట్ వెయిట్ (49 కిలోలు) విభాగంలో శ్యామ్ కుమార్ కు స్వర్ణం లభించింది. దాంతో, ఏపీకి ఆరు బంగారు పతకాలు వచ్చాయి. ప్రస్తుతం రాష్ట్రం 6 పసిడి, 3 రజత, 7 కాంస్యాలతో మొత్తం 16 పతకాలతో కొనసాగుతోంది. ఈసారి జాతీయ క్రీడలు నిర్వహించాలని తొలుత ఏపీ పట్టుదల ప్రదర్శించినా, రాజధాని నిర్మాణం, రాష్ట్ర పురోగతి తదితర అంశాల నేపథ్యంలో పట్టు సడలించింది. దీంతో, జాతీయ క్రీడల నిర్వహణ అవకాశం కేరళకు దక్కింది. విజయవాడలో ఈ క్రీడలు నిర్వహించి జాతీయస్థాయిలో రాష్ట్రాన్ని ప్రమోట్ చేయాలని సీఎం చంద్రబాబు భావించారు.