: తిరుపతిలో పోలింగ్ శాతం తగ్గే అవకాశం
తిరుపతి ఉప ఎన్నికలో పోలింగ్ శాతం తగ్గే అవకాశాలు కనబడుతున్నాయి. ఉదయం 11 గంటల వరకు 61,175 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అప్పటికి కేవలం 19 శాతం మాత్రమే పోలింగ్ నమోదైంది. అటు, ఓటింగ్ స్లిప్పుల పంపిణీ సక్రమంగా జరగకపోవడంతో ఓటర్లు పోలింగ్ కు దూరమయ్యారు. స్లిప్పులు పంపిణీ చేశామని అధికారులు చెబుతున్నప్పటికీ... చాలా మంది ఓటర్లకు అవి అందలేదని తెలిసింది. గతంలో ఓటు వేసినా ఇప్పుడు ఓటర్ల జాబితాలో పేర్లు కనిపించడం లేదని పలువురు చెబుతున్నారు. తిరుపతిలో మొత్తం 2 లక్షల 94వేల మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోవాల్సి ఉంది. సాయంత్రం 6 గంటలవరకు పోలింగ్ జరగనుంది.