: స్కూలు బస్సు ప్రమాదాలకు పాఠశాల యాజమాన్యాలదే బాధ్యత: ఏపీ మంత్రి గంటా


ఏపీలో వరుసగా చోటుచేసుకుంటున్న స్కూలు బస్సు ప్రమాదాలపై రాష్ట్ర మానవ వనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు కఠిన నిర్ణయాలకు తెరతీశారు. ఇకపై స్కూలు బస్సులు ప్రమాదాలకు గురైతే, సంబంధింత పాఠశాలల యాజమాన్యాలపైనే కేసులు నమోదు చేస్తామని ఆయన వెల్లడించారు. నేటి ఉదయం గుంటూరు జిల్లా మంగళగిరి పరిధిలోని నూతక్కి వద్ద కాలువలోకి స్కూలు బస్సు దూసుకెళ్లిన ప్రమాదంలో ఏడేళ్ల చిన్నారి మరణించింది. నలుగురు విద్యార్థులు కూడా ఈ ప్రమాదంలో తీవ్ర గాయాలపాలయ్యారు. ఈ ప్రమాదంపై స్పందించిన మంత్రి, ఇకపై పాఠశాల బస్సు ప్రమాదాలను సీరియస్ గా పరిగణిస్తామన్నారు. పాఠశాలల యాజమాన్యాలపై చర్యలు తీసుకుంటామన్నారు. బస్సుల కండీషన్ తో పాటు అన్ని రకాల అర్హతలున్న డ్రైవర్లను నియమించుకోవాల్సిన బాధ్యత పాఠశాలల యాజమాన్యాలదేనని ఆయన తేల్చిచెప్పారు.

  • Loading...

More Telugu News