: శశిథరూర్ ను నేడూ ఢిల్లీ పోలీసులు ప్రశ్నించే అవకాశం
కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ ను ఈరోజు కూడా ఢిల్లీలో ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ప్రశ్నించే అవకాశం ఉందని తెలుస్తోంది. భార్య సునంద పుష్కర్ అనుమానాస్పద హత్య కేసులో థరూర్ ను గురువారం రెండు విడతలుగా విచారించారు. నిన్న(గురువారం) 7 గంటల పాటు ఐపీఎల్ కు సంబంధించి ప్రశ్నించారు. థరూర్ ఇచ్చిన సమాధానాల్లో కొన్ని విషయాలు సందేహాస్పదంగా ఉన్నాయని సిట్ భావిస్తోంది. వాటిపైన ఈ మధ్యాహ్నం విచారించే అవకాశం ఉంది. కొద్దిసేపటి క్రితం ఆయన సరోజిని నగర్ పోలీస్ స్టేషన్ కు చేరుకున్నారు.