: ఉన్నత విద్యామండలి ఖాతాల స్తంభనపై తెలంగాణ అభ్యర్థనకు హైకోర్టు 'నో'


ఉన్నత విద్యామండలి ఎస్ బీహెచ్ ఖాతాల స్తంభనపై హైకోర్టులో ఈరోజు విచారణ జరిగింది. ఖాతాలపై యథాతథ స్థితి కొనసాగించాలని తెలంగాణ ప్రభుత్వం తరపు న్యాయవాది అభ్యర్థించారు. ఇందుకు కోర్టు నిరాకరించింది. తదుపరి విచారణను ఈ నెల 25కి వాయిదా వేసింది. రెండు పిటిషన్లపై అదే రోజు వాదనలు వింటామని తెలిపింది. ఏపీ, తెలంగాణ రాష్ట్రాలు వేరువేరుగా ఉన్నత విద్యామండళ్లు ఏర్పాటు చేసుకున్నప్పటికీ బ్యాంకు ఖాతాల విషయంలో మాత్రం నిర్ణయం తీసుకోలేదు. ఈ క్రమంలో ఖాతాలు స్తంభింపజేయాలన్న తెలంగాణ ప్రభుత్వ ఆదేశాలతో హైదరాబాదులోని ఎస్ బీహెఎచ్ శాంతినగర్ శాఖ ఖాతాల లావాదేవీలను నిలిపివేసింది.

  • Loading...

More Telugu News