: వరల్డ్ కప్ ఆడుతున్న సార్క్ దేశాలకు మోదీ శుభాకాంక్షలు


వరల్డ్ కప్ సంగ్రామం రేపటి నుంచి జరగనున్న నేపథ్యంలో, ఇందులో పాల్గొంటున్న సార్క్ దేశాలకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ ట్విట్టర్ లో శుభాకాంక్షలు తెలిపారు. "పాకిస్థాన్ ప్రధాని నవాజ్ షరీఫ్, బంగ్లాదేశ్ పీఎం షేక్ హసీనా, శ్రీలంక అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేన, ఆఫ్ఘనిస్తాన్ అధ్యక్షుడు అష్రఫ్ ఘనీలతో మాట్లాడాను. వరల్డ్ కప్ సందర్భంగా వారందరికీ నా శుభాకాంక్షలు అందజేశాను" అని ప్రధాని ట్వీట్ చేశారు. "5 సార్క్ దేశాలు (భారత్, బంగ్లాదేశ్, పాకిస్థాన్, శ్రీలంక, ఆఫ్ఘనిస్తాన్) ప్రపంచకప్ ఆడబోతుండటం చాలా ఆనందంగా ఉంది. వరల్డ్ కప్ క్రీడాస్ఫూర్తిని అందిస్తుందని ఆశిస్తున్నా. క్రీడా ప్రేమికులకు ఇదో మంచి ట్రీట్ లాంటిది. పలు ప్రాంతాల ప్రజలను క్రికెట్ కలుపుతుంది. సుహృద్భావాన్ని వ్యాప్తి చేస్తుంది. సార్క్ దేశాల ఆటగాళ్లు గెలుపు పట్ల తపనతో ఆడతారని, వారి దేశాలకు గౌరవం తీసుకొస్తారని అనుకుంటున్నా" అని మోదీ పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News