: కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ చదివిన స్కూలుపై దుండగుల దాడి
సౌత్ న్యూఢిల్లీ పరిధిలోని ఓ క్రిస్టియన్ స్కూలుపై నేటి ఉదయం గుర్తుతెలియని దుండగులు దాడి చేశారు. కొందరు వ్యక్తులు గుంపుగా వచ్చి మొదట సీసీటీవీని ధ్వంసం చేసినట్టు ఒక కెమెరాలో రికార్డు అయింది. ఆపై ప్రిన్సిపాల్ గదిని ధ్వంసం చేసి రూ. 8 వేలు ఎత్తుకెళ్లినట్టు తెలుస్తోంది. పోలీసుల రాకను గమనించి దుండగులు పారిపోగా, కేసు నమోదు చేసుకొని నిందితులను గుర్తించే చర్యలు చేపట్టారు. రాజధాని ప్రాంతంలో క్రైస్తవ ప్రార్థనామందిరాలు, క్రిస్టియన్ స్కూల్స్ పై దాడులు జరగటం ఏడాదిలోపు ఇది ఆరోసారి. కాగా, కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ తన చిన్నతనంలో ఈ స్కూల్లోనే చదివారు.