: 'టెంపర్'తో చుక్కలు చూపారు... బెనిఫిట్ షో వేయలేదని తిరుపతిలో అభిమానుల విధ్వంసం


టాలీవుడ్ హీరో జూనియర్ ఎన్టీఆర్ తాజా చిత్రం 'టెంపర్'ను తమ కోసం ప్రత్యేకంగా ప్రదర్శించకపోవడంపై ఆగ్రహిస్తూ, తిరుపతిలో ఆయన అభిమానులు రెచ్చిపోయారు. ఇక్కడి జయశ్యాం థియేటర్ పై దాడి చేసి అద్దాలు, ఫర్నిచర్ ధ్వంసం చేశారు. యాక్షన్ ఫిల్మ్గా తెరకెక్కిన 'టెంపర్' నేడు ప్రపంచవ్యాప్తంగా విడుదలైన విషయం తెలిసిందే. చాలా చోట్ల ఉదయం 5 గంటలకే ప్రత్యేక షోలు వేశారు. తిరుపతిలో కూడా ఫాన్స్ కోసం ప్రత్యేక షో ఉంటుందని భావించిన అభిమానులు తెల్లవారుజాము నుంచే సినిమా హాలు వద్ద నిరీక్షించారు. ప్రత్యేక ఆట వేసేందుకు థియేటర్ యాజమాన్యం నిరాకరించగా, అభిమానుల ఆగ్రహం కట్టలు తెంచుకుంది. రంగంలోకి దిగిన పోలీసులు అక్కడి ఉద్రిక్త పరిస్థితిని అదుపులోకి తెచ్చారు.

  • Loading...

More Telugu News