: హోసూరు రైలు ప్రమాదంలో 8 మంది మృతి... ఘటనాస్థలికి కేంద్రమంత్రి సదానంద గౌడ
తమిళనాడులోని హోసూరు సమీపంలో నేటి ఉదయం చోటుచేసుకున్న రైలు ప్రమాదంలో ఎనిమిది మంది ప్రయాణికులు మృత్యువాత పడ్డారు. ఈ ప్రమాదంలో గాయపడ్డ మరికొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. బెంగళూరు నుంచి ఎర్నాకుళం వెళుతున్న ఇంటర్ సిటీ ఎక్స్ ప్రెస్ నేటి ఉదయం హోసూరు వద్ద పట్టాలు తప్పింది. రైలు ఇంజిన్ లో మంటలు చెలరేగిన నేపథ్యంలో, దాని వెనుక ఉన్న బోగీలన్నీ పట్టాలు తప్పాయి. ప్రస్తుతం అక్కడ ఎన్డీఆర్ఎఫ్ బృందాల ఆధ్వర్యంలో సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. విషయం తెలుసుకున్న కేంద్ర మంత్రి సదానంద గౌడ హుటాహుటిన ఘటనాస్థలానికి బయలుదేరారు.