: షాపులకు సెలవు లేకుండా చట్టం తేనున్న తెలంగాణ ప్రభుత్వం


తెలంగాణలోని అన్ని జిల్లాల్లో వ్యాపార, వాణిజ్య కేంద్రాలు ఆదివారంతో సహా అన్ని రోజులు తెరచి ఉంచేలా చూస్తామని, ఇందుకోసం అవసరమైతే చట్ట సవరణ చేస్తామని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అన్నారు. దీనికోసం ప్రతిపాదనలు పంపించాలని కార్మిక శాఖను ముఖ్యమంత్రి ఆదేశించారు. వారమంతా పని చేసినవారికి, ఆదివారం సెలవు దినం కావడం వల్ల, షాపింగ్ చేసే అవకాశం లేకుండా పోతోందని ముఖ్యమంత్రి అభిప్రాయపడ్డారు. ఇదే సమయంలో ఈ వ్యాపార సంస్థలలో పనిచేసే వారితో నిర్ణీత సమయం కంటే ఎక్కువ పని చేయించకుండా గట్టి చర్యలు తీసుకోవాలని, అలాగే ప్రైవేట్ సంస్థలలో పనిచేసే వారికి వీక్లీ ఆఫ్ విధానం కచ్చితంగా అమలు చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.

  • Loading...

More Telugu News