: లోదుస్తుల్లో 2 కిలోల బంగారం... శంషాబాద్ ఎయిర్ పోర్టులో పట్టుకున్న కస్టమ్స్ అధికారులు
అక్రమ మార్గాల్లో బంగారాన్ని దేశంలోకి తరలిస్తున్న ఘటనలు నానాటికీ పెరిగిపోతున్నాయి. పోలీసుల కళ్లుగప్పి బంగారాన్ని యథేచ్ఛగా తరలిస్తున్న స్మగ్లర్లు ఎప్పటికప్పుడు కొత్త మార్గాలను ఎంచుకుంటున్నారు. నేటి ఉదయం శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో తనిఖీలు చేపట్టిన కస్టమ్స్ శాఖ అధికారులు దుబాయి నుంచి వచ్చిన అయూబ్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. సోదాల్లో భాగంగా అతడి లోదుస్తుల్లో రెండు కిలోల బంగారం బయటపడింది. దీంతో, అతడిని అరెస్ట్ చేసిన పోలీసులు లోదుస్తుల్లో బయటపడ్డ బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు.