: రిగ్గింగ్ కు టీడీపీ ఏర్పాట్లు చేసుకుంది... ఎన్నికలు స్వేచ్ఛగా జరిగితే కాంగ్రెస్ దే విజయం: చింతా
తిరుపతి ఉప ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలన్న లక్ష్యంతో, దొంగ ఓట్లు వేయించుకోవడానికి కుట్ర పన్నడంతో పాటు మధ్యాహ్నం ఒంటి గంట తర్వాత రిగ్గింగ్ చేయడానికి టీడీపీ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకుందని కాంగ్రెస్ పార్టీ నాయకుడు, మాజీ ఎంపీ చింతామోహన్ విమర్శించారు. స్వేచ్ఛగా ఎన్నికలు జరిగితే టీడీపీకి ఓటమి తప్పదని, కాంగ్రెస్ ఘనవిజయం సాధిస్తుందని అన్నారు. కాగా, తిరుపతి ఉప ఎన్నిక పోలింగ్ నేటి ఉదయం ప్రారంభం అయింది. పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు బారులు తీరారు. కొన్ని ప్రాంతాల్లో ఈవీఎంలు మొరాయించినట్టు తెలుస్తోంది.