: భారత్ కు మద్దతిస్తాం: చైనా
ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వానికి మద్దతిస్తామని చైనా తెలిపింది. ఈ మేరకు చైనా విదేశాంగ శాఖ ప్రతినిధి మాట్లాడుతూ, భద్రతా మండలిలో నిర్ణయాత్మక పాత్ర పోషించాలనే భారత్ ఆకాంక్షకు మద్దతిస్తామని అన్నారు. భారత్, బ్రెజిల్ ల శాశ్వత సభ్యత్వాల ప్రయత్నాలను చైనా గౌరవిస్తుందని ఆయన చెప్పారు. దౌత్య మార్గాల ద్వారా విస్తృత ఏకాభిప్రాయం వల్లే ఐక్యరాజ్యసమితి సంస్కరణలు చేపట్టాలని చైనా ఉద్దేశ్యమని ఆయన స్పష్టం చేశారు. ఇటీవల జరిగిన భారత్, రష్యా, చైనా విదేశాంగ శాఖల ప్రతినిధుల సమావేశంలో కూడా రష్యాతో కలిసి తాము భారత్ శాశ్వత సభ్యత్వానికి మద్దతు ఇచ్చామని ఆయన గుర్తు చేశారు. కాగా, జపాన్ కు శాశ్వత సభ్యత్వం గురించి ప్రశ్నించగా, ఆయన మౌనందాల్చారు.