: 125 టోల్ ప్లాజాలను తీసేస్తున్నాం: నితిన్ గడ్కరీ


ప్రధాన పట్టణాల్లో హైవే రోడ్డు ఎక్కితే చాలు, జరిమానా కట్టినట్టు, ఆ రోడ్డును వినియోగించుకున్నందుకు ఫీజు కట్టాల్సిందే. దేశ వ్యాప్తంగా రహదారులను నిర్వహించేందుకు కొన్ని కంపెనీలకు లీజుకిచ్చిన సంగతి తెలిసిందే. దీంతో ఆయా రోడ్లపై టోల్ గేట్లు ఏర్పాటు చేసి సదరు కంపెనీలు లాభాలార్జిస్తున్నాయి. కొన్ని టోల్ గేట్లపై వివాదాలు నెలకొన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో 125 టోల్ గేట్లను ఎత్తేస్తున్నట్టు కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. ఫిబ్రవరి నెలాఖరుకి వీటి తొలగింపు పూర్తవుతుందని ఆయన వెల్లడించారు. ఇప్పటికే 65 రహదారుల్లో టోల్ ఫీజును వసూలు చేయడం నిలిపేశామని ఆయన చెప్పారు.

  • Loading...

More Telugu News