: మోదీ ప్రధానిగా ఉండటం మనకు సానుకూల అంశం: కేసీఆర్
సార్వత్రిక ఎన్నికల ప్రచార సమయంలో నరేంద్ర మోదీని సైతం నోటికొచ్చినట్టు తిట్టిన టీఎస్ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రస్తుతం తన శైలిని మార్చారు. మోదీని, కేంద్ర ప్రభుత్వాన్ని మచ్చిక చేసుకునే పనిలో పడ్డారు. ముఖ్యమంత్రిగా పని చేసిన మోదీ ప్రధానిగా ఉండటం మనకు కలసివచ్చే అంశమని కేసీఆర్ అన్నారు. అన్ని శాఖల ముఖ్య కార్యదర్శులతో ఈ రోజు ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్ట్రాలకు కేంద్రం ఇచ్చే నిధుల విధానంలో చాలా మార్పులు రానున్నాయని చెప్పారు. విద్యుత్ విషయంలో కొన్ని ఇబ్బందులు ఉన్నాయని... దాన్ని అధిగమించే ప్రయత్నం చేద్దామని అధికారులకు కేసీఆర్ సూచించారు. అన్ని శాఖల మధ్య సమన్వయం ఉండాలని అన్నారు. దాపరికం లేని బడ్జెట్ ను ప్రవేశ పెట్టాలని చెప్పారు.