: నెట్స్ లో చెమటోడ్చిన టీమిండియా ఆటగాళ్లు


చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్ తో వరల్డ్ కప్ మ్యాచ్ కు ముందు టీమిండియా ఆటగాళ్లు నెట్స్ లో చెమటోడ్చారు. అడిలైడ్ లో ఉదయం సెయింట్ పీటర్స్ కళాశాల మైదానంలో కష్టించిన భారత ఆటగాళ్లు, ఆ తర్వాత అడిలైడ్ ఓవల్ లో ఇండోర్ నెట్స్ లో తీవ్రంగా శ్రమించారు. ఫిజికల్ ట్రెయినర్ సుదర్శన్ పర్యవేక్షణలో ఫిట్ నెస్ కు అవసరమైన కసరత్తులు చేశారు. ఈ నెల 15న పాక్ తో జరిగే ప్రతిష్ఠాత్మక మ్యాచ్ కు అడిలైడ్ ఓవల్ మైదానమే వేదిక. కాగా, టీమిండియా ప్రాక్టీసు చేస్తుండగా, అక్కడికి మీడియాను అనుమతించలేదు.

  • Loading...

More Telugu News