: హన్మకొండ చేరుకున్న చంద్రబాబు... ఘన స్వాగతం
ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు వరంగల్ జిల్లా హన్మకొండ చేరుకున్నారు. ఈ ఉదయం హైదరాబాద్ నుంచి ప్రత్యేక బస్సులో ఆయన హన్మకొండ బయల్దేరారు. ఆయన వెంట భారీ కాన్వాయ్ కూడా బయల్దేరింది. భువనగిరి, జనగామ తదితర ప్రధాన పట్టణాల్లో ఆగుతూ, అభిమానులను పలకరిస్తూ, ప్రసంగిస్తూ ఆయన ప్రయాణం కొనసాగింది. అక్కడక్కడ చంద్రబాబు కాన్వాయ్ ని అడ్డుకునేందుకు టీఆర్ఎస్, ఎమ్మార్పీఎస్ కార్యకర్తలు ప్రయత్నించినప్పటికీ, ఎక్కడా సమస్యలు ఉత్పన్నం కాలేదు. ఈ క్రమంలో కాసేపటి క్రితం ఆయన హన్మకొండ చేరుకున్నారు. ఈ సందర్భంగా టీడీపీ శ్రేణులు ఆయనకు ఘన స్వాగతం పలికాయి. హన్మకొండలోని తెలంగాణ అమరవీరుల స్తూపానికి చంద్రబాబు నివాళి అర్పించారు.